రాష్ట్రంలో రాక్షస రాజకీయం నడుస్తుంది

SMTV Desk 2019-03-04 16:14:55  clp leader bhatti vikramarka, congress party, trs, kcr

హైదరాబాద్, మార్చ్ 3: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాజకీయ క్రీడ నడుస్తోందని, టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కలుషితమైందని అలాగే జరుగుతున్న పరిణామాలు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారన్నది ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. ఈరోజు జరిగే సీఎల్పీ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు.