కిలాడి లేడి దందా.. ఆశ్చర్యపోయిన పోలీసులు!!

SMTV Desk 2017-08-05 13:29:22  drugs maafiaa, sangeetha, nizeeria gang

హైదరాబాద్, ఆగస్ట్ 5 : డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం బయటికొస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసుల విషయంలో విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. అయిన డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు గుట్టుచప్పుడు కాకుండా తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నారు. తాజాగా ఒక "లేడి డాన్ సంగీత" విషయం నగరంలో హల్ చల్ సృష్టిస్తోంది. ఈమె నైజీరియా ముఠాతో జతకట్టి సంపన్నుల కుటుంబాలనే ఎరగా వేసి ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిసింది. ఆమె తీరు చూసి పోలీసులే షాక్ కి గురవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.... విజయవాడ నగరానికి చెందిన తాలపర్తి సంగీత అనే యువతి డ్రగ్స్ అక్రమ రవాణాను విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఈమె నిర్వహిస్తున్న వ్యభిచార దందా కూడా వెలుగులోకి వచ్చింది. గతనెల 24వ తేదీన నైజీరియా ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు తీగ లాగగా డొంకంత కదిలింది. ఈమె గతం గురించి కూడా పోలీసులు ఆరా తీయగా కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటికి వచ్చాయి. పలువురు అమాయక అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి లాగడమే కాకుండా ఎదురుతిరిగిన యువతుల న్యూడ్ ఫోటోలను తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసింది. దీనికి తోడు ఆన్ లైన్ చాటింగ్ లో భాగంగా ఒక నైజీరియన్ మహిళతో సంగీతకు పరిచయం ఏర్పడింది. సదరు మహిళ ఒజుగో కాస్మోస్ అనే వ్యక్తిని సంగీతకు పరిచయం చేసింది. ఈ పరిచయం కాస్త బిజినెస్ పార్టనర్షిప్ వరకు వెళ్ళింది. కాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కాస్మోస్ తో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించిన పోలీసులు పది గ్రాముల కొకైన్, పన్నెండు గ్రాముల బ్రౌన్ షుగర్, లక్షన్నర నగదు, లాప్ టాప్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసలు సంగీత డ్రగ్స్ ఎవరెవరికి సప్లై చేసింది, ఇందులో కేవలం సంపన్నుల కుటుంబాల పిల్లలే కాకుండా సినిమా స్టార్స్ కూడా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.