ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్

SMTV Desk 2017-08-05 13:27:01  Srilanka-India Test, India Second Test 1st Innings, Srilanka Second Test 1st innings

కొలంబో, ఆగష్ట్ 5: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. ముందుగా అనుకున్నట్లే భారత్ జట్టు శ్రీలంక ముందు భారీ అధిక్యాన్ని ఉంచింది. భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఐదు వికెట్లు తీయడంతో ఆతిధ్య జట్టు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. తరంగ (0), కరుణ రత్నె (25) వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోరు 50 తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన లంక జట్టులో డిక్ వెల్లా (51) అర్థ సెంచరీ చేయగా, మాథ్యూస్ (26) దిల్ రువాన్ (25), మెండిస్ (24), చండిమాల్ (10), డిసిల్వా (0), హెరాత్ (2), ఫెర్నాండో (0) పరుగులు చేశారు. దీంతో కేవలం 183 పరుగులకే శ్రీలంక పెవిలియన్ చేరింది. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు, జడేజా 4 వికెట్లు, షమి రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 439 పరుగులు ఆధిక్యంలో ఉంది