కాలువలకు నీటి విడుదలను పెంపు చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

SMTV Desk 2019-03-02 18:40:54  sriramsagar project, water release, saraswathi canal

శ్రీరాంసాగర్‌, మార్చ్ 2: సరస్వతి కాలువకు కొత్తగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ మహేందర్‌ తెలిపారు. వీటికి సంబంధించిన నీటి విడుదలలో భాగంగా 500 క్యూసెక్కుల నుంచి 700 క్యూసెక్కులకు పెంచినట్లు ఆయన తెలిపారు. అలాగే అలీసాగర్‌ ఎత్తిపోతలకు 135, కాకతీయ కాలువకు 6 వేలు, నిర్మల్‌, ఆదిలాబాద్‌కు 33, నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌కు 52, లక్ష్మి కాలువకు 200, క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.