237 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి కోహ్లీ సేన

SMTV Desk 2019-03-02 18:23:43  India vs australia, 1st odi, hyderabad uppal, virat kohli

హైదరాబాద్, మార్చ్ 2: నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆసిస్, టీం ఇండియాకు 237 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. కోహ్లీ సేన బౌలింగ్ విభాగం బాగా పనిచేయడంతో మ్యాచ్ మొత్తం మీద 2 సిక్సులు, 26 ఫోర్లు మాత్రమే చేయగలిగారు. ఆసీస్ జట్టు మొత్తంలో ఉస్మాన్ ఖవాజా(50) మాత్రమే 76 బంతులాడి అత్యధిక స్కోరు నమోదు చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో టీ20లో చెలరేగి ఆడిన గ్లెన్ మ్యాక్స్ వెల్(40) మీద నిలుపుకున్న ఆశలు నిలబెట్టుకోలేకపోయాడు. పీటర్ హ్యాండ్స్ కాంబ్(19), ఆస్టన్ టర్నర్ (21), అలెక్స్ క్యారీ(36), కౌల్టర్ నైల్(28), పాట్ కమిన్స్(0) పరుగులు చేయగలిగారు. కంగారూలపై రెచ్చిపోయిన భారత బౌలర్లు కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 2, కేదర్ జాదవ్ 1, షమీ 2 తీయగలిగారు. వికెట్లు పడగొట్టలేకపోయినా పరుగుల విషయంలో మాత్రం అదుపుచేయగలిగారు. బుమ్రా బౌలింగ్ లో మాత్రమే బౌండరీలు చేసేందుకు ఆసీస్ బ్యాట్స్ మెన్ కు చక్కటి అవకాశాలు దక్కాయి.