బాలీవుడ్ వెళ్తున్న కీర్తి సురేష్ ..?

SMTV Desk 2019-03-02 17:48:24  Keerthi suresh,

మహానటి సినిమాతో తన నటనా ప్రతిభ చాటుకున్న మళయాళ భామ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో కన్నా తమిళంలో కీర్తి సురేష్ స్టార్స్ సరసన ఛాన్సులు కొట్టేస్తుంది. ప్రస్తుతం విజయ్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మూవీతో పాటుగా మురుగదాస్, రజినికాంత్ కలిసి చేస్తున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ ఛాన్స్ దక్కించుకుంది.

ఇదే కాకుండా ఈ అమ్మడికి బాలీవుడ్ నుండి కూడా బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తుంది. అమిత్ శర్మ డైరక్షన్ లో బోనీ కపూర్ నిర్మిస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. కథా చర్చలు ఆల్రెడీ ముగిశాయని తెలుస్తుంది. తన అభినయంతో సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తున్న కీర్తి సురేష్ తప్పకుండా బాలీవుడ్ లో కూడా రాణిస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.