సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలు పునఃప్రారంభం

SMTV Desk 2019-03-02 17:35:00  Samjhauta express restart, paksitan, india

ఇస్లామాబాద్‌, మార్చ్ 2: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను పాకిస్థాన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాక్‌కు చెందిన మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో పాక్‌ నుంచి అటారీకి రావల్సిన భారత ప్రయాణికులు పాక్‌ నిర్ణయంతో లాహోర్‌ రైల్వే స్టేషన్‌లోనే నిలిచిపోయారు. కాగా.. ఈ రైలు సేవలను ఆదివారం నుంచి మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు భారత్, పాక్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌.. భారత్‌కు అప్పగింత కార్యక్రమం పూర్తైన అనంతరం ఇరు దేశాలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 3న తొలి రైలు ఢిల్లీ నుంచి బయలుదేరనుందని.. తిరిగి సోమవారం లాహోర్ నుంచి రిటర్న్ కానుందని రైల్వే అధికారులు తెలిపారు. భారత్-పాక్ ల మధ్య నడిచే ఏకైక రైలు సర్వీస్ ఇదే.