తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు

SMTV Desk 2019-03-02 17:23:04  Gold rate, Bullion market

న్యూఢిల్లీ, మార్చ్ 2: బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు రూ.310 తగ్గడంతో బంగారం ధర రూ.34వేల మార్క్‌ కిందకి చేరింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.33,770కి చేరింది. అయితే డాలరు విలువ పది వారాల గరిష్ఠానికి చేరడం, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ మందగించడం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధర దిగొస్తున్నట్లు ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు వెండి పసిడి బాటలోనే పయనించి రూ.40వేల మార్క్‌ దిగువకు చేరింది. రూ.730 తగ్గడంతో కిలో వెండి రూ.39,950కి చేరింది.