మిస్సింగ్ సూర్యకుమారి తల్లిదండ్రులు ఏమన్నారంటే?

SMTV Desk 2017-08-05 12:31:13  Vijayawada Doctor Suryakumari missing, collectors sister suryakumari missing, Ex mla son vidyasagar

విజయవాడ, ఆగష్ట్ 5: విజయవాడలో డాక్టర్ సూర్యకుమారి అదృశ్యం కేసు హైదరాబాద్ విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులానే పలు అనుమానాలకు తావుతీస్తుంది. మూడు రోజులైనా ఇప్పటికీ ఆచూకీ దొరక్కపోవటంతో, కుటుంబ సభ్యులలో ఆందోళన మరింత పెరిగిపోయింది. అయితే, మిస్సింగ్ వెనుక ఎవరి ప్రమేయమైన ఉందా? లేదా మరో ఏ కారణం చేతనైన తానే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అన్న కోణాలలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ సూర్యకుమారి కృష్ణాజిల్లా విస్సన్న పేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె చివరగా మాజీ ఎమ్మెల్యే జయరాజ్‌ కుమారుడు విద్యసాగర్ కి మెసేజ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డాక్టర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ... సాగర్ తమ కూతురిని రహస్య ప్రాంతంలో ఉంచాడని, లేకపోతే సూర్య కుమారి మొబైల్ విద్యసాగర్ దగ్గరికి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. అంతే కాకుండా పలు అనుమానాలను కూడా వ్యక్తం చేసారు. మరో వైపు డాక్టర్ అదృశ్యానికి ముందు విద్యసాగర్ ఇంటికి వెళ్ళినట్లు సమాచారం. అయితే దీనిపై విద్యాసాగర్ మాట్లాడుతూ... సూర్యకుమారి పీజీ చేయడానికి ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పి, తోడుగా స్టేషన్ వరకు రమ్మని అడిగిందని అన్నారు. కానీ విద్యాసాగర్ రావడానికి తిరస్కరించడం తో సూర్యకుమారి వెంటనే వెను తిరిగింది. వాళ్లిద్దరి మధ్య స్నేహ సంబంధం తప్ప మరేమి లేదని చెబుతూ..కేవలం మరిచిపోయిన మొబైల్ ను తిరిగి ఇచ్చేందుకే తన ఇంటికి వెళ్లానని తెలిపాడు విద్య సాగర్. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న తరుణంలో పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు వేచి చూడాల్సిందే. అసలు, కారణం డాక్టర్ కావాలనే ఇల్లు విడిచి వెళ్లిపోయిందా, (లేదా) విద్యాసాగర్ ప్రమేయంతో ఎక్క డైనా ఉందా లేక సూర్యకుమారి మెసేజ్ లో తెలిపినట్లు వాళ్ల తల్లిదండ్రులే దాచిపెట్టారా అనే అంశం వెలుగులోకి రావాల్సి ఉంది.