ప్రపంచ బ్యాంక్ ప్రశంసలందుకున్న రైతు బంధు పథకం

SMTV Desk 2019-03-02 16:17:23  World Bank, TRS Government raithu badhu scheme, strategy impact evolution fund office

వాషింగ్టన్, మార్చ్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ పథకాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. ప్రపంచ బ్యాంక్ సంబంధిత సంస్థ స్ట్రాటజీ ఇంపాక్ట్ ఇవాల్యుయేషన్ ఫండ్ రైతు బంధు చెక్కుల పంపిణీలో ఫోన్‌ ఆధారిత సమన్వయాన్ని మెచ్చుకుంది. ఫోన్‌ కాల్స్‌ ద్వారా రైతు బంధు పథకంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని సీఫ్‌ సంస్థ తెలిపింది. ఫోన్ కాల్స్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో రైతుల్లో వ్యవసాయంపై ఆసక్తి పెరింగిదనీ, రైతు బంధు పథకంతో పంటలకు ముందు అప్పులు చేయడం మానుకున్నారని సీఫ్‌ వివరించింది. మిగతా పథకాల్లో కూడా ఫోన్‌ కాల్స్‌ ద్వారా అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని వరల్డ్ బ్యాంక్‌ స్ట్రాటజీ ఇంపాక్ట్‌ ఇవాల్యుయేషన్‌ ఫండ్‌ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ పథకంపై స్ట్రాటజీ ఇంపాక్ట్‌ ఇవాల్యుయేషన్‌ ఫండ్‌ సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది.