ఈసారే ఆఖరి, మరోసారి టికెట్ రాదు

SMTV Desk 2019-03-02 16:15:59  Revanth Reddy, Harish Rao, Chandrasekhar Rao, TRS, Congres, Court, MP, MLA

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమెల్యే హరీష్‌రావు కాలం చెల్లినట్లేనని ఎద్దేవా చేశారు. శనివారం ఓ కేసుకు సంబంధించి సిద్దిపేట కోర్టుకు రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, నమ్మినవాళ్లను నట్టేటముంచడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు అలవాటేనని అన్నారు. హరీశ్‌కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్ రాదని ఆయన జోస్యం చెప్పారు. 16 మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడతామంటున్నారని ఆయన కెసీఆర్ పై వ్యాఖ్యానించారు. కాగా, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని ప్రశ్నించారు.