అభినందనీయం...స్పూర్తిదాయకం - భారత పైలట్ గురించి మరిన్ని విషయాలు!!

SMTV Desk 2019-03-02 16:13:28  abhinandhan, indian pilot, pok, pakistan army

న్యూఢిల్లీ , మార్చి 02: జై జవాన్! జై కిసాన్ !! నాడు దేశం కోసం జవాహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన నినాదం.

జై భారత్!
జై జై భారత్!!
నేడు దేశం కోసం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పలికిన నినాదం ఇది.

రెండు రోజుల క్రితం పాక్ యుద్ధ విమానాలతో తలపడుతూ.....పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి మన కమాండర్ ప్రవేశించారన్న విషయం తెలిసిందే. యల్ ఓ సీ నుండి దాదాపు 7 కి. మీ లోపలికి వెళ్ళాడు. అయితే అప్పటికే పాకిస్తాన్ యుద్ధ విమానం తప్పించుకుంది. కానీ ఈ లోపు మిగ్ విమానం నేలకూలబోతుందని తెలుసుకున్న అభినందన్ ప్యారశూట్ సాయంతో ల్యాండ్ అయ్యాడు.

తరువాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే అయినప్పటికీ కొన్ని వాస్తవాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అవి ఇప్పుడు మీ కోసం.......

ఇండియా నుంచే కాదు పాకిస్తాన్ నుండి కూడా అభినందన్ కు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఫ్లైట్ కూలిన తర్వాత అభినందన్ ప్రదర్శించిన సాహాసం గురించి పాకిస్తాన్ కి చెందిన ఒక పత్రిక చాలా స్పష్టంగా రాసింది. భారత పైలట్ ధైర్య సాహాసాల గురించి ప్రపంచానికి చెప్పింది.

శత్రుదేశం చేతిలో బంధీ అయ్యాడని తెలిసి ఎక్కడా ఆత్మస్థైర్యం కొలిపోలేదు. చావు కళ్ళముందున్న.... కళ్ళల్లో ధైర్యం, ముఖంపై.....చెరగని చిరునవ్వుతో దాయాది దేశం నలు దిక్కులకు వినిపించేలా "భారత్ మాతాకి జై!" అంటూ నినాదాలు చేసిన మన భారత వీరుడి కథనం ప్రచురించింది సదరు పాకిస్తాన్ పత్రిక.

భారత పైలట్ అభినందన్ దేశ భక్తికి నిలువెత్తు నిదర్శనమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ సంధించిన ప్రశ్నలకు ఎక్కడా ఆత్మ విశ్వాసం కొలిపోకుండా సమాధానాలు చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.

ఇప్పుడు ఆ వీడియోలోని ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం.....

1. పాక్ ఆర్మీ అధికారి: నీ పేరేంటి?
జ. అభినందన్: వింగ్ కమాండర్ అభినందన్

2. పాక్ ఆర్మీ అధికారి: మేము నిన్ను బాగా చుసుకున్తున్నాం కదా!
జ. అభినందన్: అవును! నేను స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నాను. నేను ఒకవేళ నా దేశానికి తిరిగి వెళ్లినా..... నా స్టేట్ మెంట్ మాత్రం మారదు. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నన్ను స్థానిక మూకల నుండి కాపాడారు. పాకిస్తానీ ఆర్మీ ఆతిథ్యానికి నేను ఇంప్రెస్ అయ్యాను.

3. పాక్ ఆర్మీ అధికారి: నువ్వు ఇండియా లో ఏ ప్రాంతానికి చెందిన వాడివి?
జ. అభినందన్: క్షమించండి! ఈ విషయం చెప్పకూడదు. కాని నేను డౌన్ సౌత్ కి చెందిన వాడిని.

4. పాక్ ఆర్మీ అధికారి: నీకు పెళ్లయ్యిందా?
జ. అభినందన్: అవును!

5. పాక్ ఆర్మీ అధికారి: మా టీ నీకు బాగా నచ్చినట్టుంది
జ. అభినందన్: అవును టీ చాలా బాగుంది. థాంక్యూ!!

6. పాక్ ఆర్మీ అధికారి: నువ్వు ఏ ఎయిర్ క్రాఫ్ట్ ని నడపగాలవు?
జ. అభినందన్: సారీ మేజర్. నేను చెప్పడానికి వీళ్ళేదు.

7. పాక్ ఆర్మీ అధికారి: మీ మిషన్ ఏంటి?
జ. అభినందన్: ఐయాం సారీ! నేను ఇది కూడా చెప్పలేను.

అభినందన్ ఇప్పుడొక రోల్ మోడల్. నేటి యువతకు ఆదర్శం. సైన్యంలోకి వెళ్లాలనుకునే వారికి మోడల్ సోల్జర్. సైనికుడి నిజమైన పోరాటం నిన్నటి వరకు సినిమాల్లోనే చూసాం. కానీ అభినందన్ నిజమైన ఆర్మీ పోరాటాన్ని మనందరికీ తెలియజేసాడు. చావుకి భయపడని వాడు ఎక్కడున్నా ఒక్కటే అని నిరూపించాడు. అభినందన్ ధైర్య సాహాసాలు చూసి యావత్ దేశం శభాష్ అంది. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి ప్రూవ్ చేసాడు మన రియల్ హీరో.