ఆయన కోసం నా నిబంధనని పక్కన పెట్టేస్తాను

SMTV Desk 2019-03-02 15:32:32  Tamanna, Movie news

హైదరాబాద్, మార్చి2: తెలుగు .. తమిళ .. హిందీ భాషా ప్రేక్షకులలో తమన్నాకి మంచి క్రేజ్ వుంది. గ్లామరస్ గా కనిపించడానికి తమన్నా ఎంత మాత్రం ఆలోచించదు. అయితే ముద్దు సీన్ల విషయంలో మాత్రం ఆమె మొదటి నుంచి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. తన అగ్రిమెంట్ లో ముద్దు సీన్లు చేయననే నిబంధన తప్పకుండా ఉంటుందని తమన్నా చెబుతోంది.

"ఒకవేళ ఈ నిబంధనను సడలించవలసి వస్తే, హృతిక్ రోషన్ సినిమా కోసం మాత్రమే సడలిస్తాను అని అంది. హృతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం .. ఆయనకి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే .. అందులో ముద్దుసీన్లు చేయవలసి వస్తే నా నిబంధనను పక్కన పెట్టేస్తాను" అని చెప్పుకొచ్చింది.

అయితే, తమన్నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి మరి.