వీళ్ల రొమాన్స్ చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారట

SMTV Desk 2019-03-02 15:30:57  Shimbu, Oviya, 91ml

చెన్నై, మార్చి 02: తమిళ బిగ్ బాస్ షోతో ఓవియాకి కోలివుడ్ లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తాజాగా ఆమె నటించిన 90ml సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్ లతో ఈ సినిమాపై అంచనాలను పెంచేసారు. పైగా ఈ సినిమాకి శింబు సంగీతం అందించడం, అంతేకాదు సినిమాలో క్యామియో కూడా చేశాడని తెలియడంతో అభిమానులు సినిమా థియేటర్లకు క్యూ కట్టారు.

ఆశించినట్టుగానే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఓ రేంజ్ లో ఉందట. ఇక్కడ హైలైట్ అవుతోన్న మరో విషయం ఏంటంటే.. సినిమాలో శింబు కేవలం క్యామియో రోల్ అనుకుంటే ఏకంగా ఓవియాతో ఆయనకు లిప్ లాక్ సీన్ పెట్టారట. తెరపై ఈ జంట రొమాన్స్ చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారట.

శింబు ఉంటాడని తెలుసు కానీ ఓవియాతో రొమాన్స్ సీన్స్ లో నటిస్తాడని ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ సీన్స్ వారికి థ్రిల్లింగ్ గా అనిపించాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.