రాహుల్ గాంధీతో డేట్ కి వెళ్ళాలనుకుంటున్నా

SMTV Desk 2019-03-02 15:27:48  Kareena Kapoor, Rahul gandhi

ముంబై, మార్చి 02: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తో వివాహం అయిన తర్వాత కూడా సినిమాలలో తన జోరు కొనసాగిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకి కరీనా చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

"మీరు ఎవరితో డేట్ కు వెళ్లాలనుకుంటున్నారు..?" అని కరీనాను అడగగా, "రాహుల్ గాంధీ" అని సమాధానం చెప్పింది. ఈ ప్రశ్నకి నేను ఈ సమాధానం చెప్పొచ్చో.. లేదో తెలియదు కానీ చెబుతాను అంటూ రాహుల్ పేరు చెప్పింది. అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందని వెల్లడించింది.

వార్తా పత్రికల్లో అతడి ఫోటోలు చూస్తున్నప్పుడు అతడితో మాట్లాడితే ఎలా ఉంటుందని అనుకునేదట కరీనా. పూర్తిగా సినిమాలకు అంకితమైన కుటుంబం నుండి వచ్చిన కరీనా.. రాజకీయ కుటుంబానికి చెందిన రాహుల్ తో చర్చ ఆసక్తికరంగా ఉంటుందేమోనని చెప్పింది.