యూట్యూబ్‌లో ఓ వీడియో చూసి...ఆ చిన్నారి అలా చేసింది!!!

SMTV Desk 2017-08-05 11:30:00  8 years girl, hot water, dead

ఫ్లోరిడా, ఆగస్ట్ 5 : వేడి నీటిలో స్ట్రా వేసుకొని తాగడంతో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్నారి తన కజిన్‌తో పందెం కాసి వేసి వేడి నీటిని స్ట్రాతో తాగినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ బాలిక నోరు, గొంతు కాలడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. హుటాహుటిన ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా యూట్యూబ్‌లో ఓ వీడియో చూసి తాను కూడా అలా చేస్తానని ఇద్దరు పందెం వేసుకోవడంతోనే ఈ పనికి పాల్పడినట్లు ఆ బాలిక తల్లిదండ్రులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.