లక్కీ గర్ల్ అనిపించుకుంటున్న రష్మిక

SMTV Desk 2019-03-02 15:17:24  Rashmika, Yajamana, darshan, telugu Tamil, Kannada, karthi

హైదరాబాద్, మార్చి 02: తెలుగులో వరుస విజయాలు సాధించిన రష్మిక, కన్నడలోను వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం యాజమాన నిన్ననే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి హిట్ టాక్ వస్తోంది. ఈ సినిమాలో రష్మిక దర్శన్ కు జోడీగా నటించింది.

ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కావడం, భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకోవడం పట్ల రష్మిక సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. కన్నడలో హిట్ లభించడంతో రష్మికకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. తమిళంలో ఇప్పటికే కార్తీ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది రష్మిక. ఆ సినిమా కూడా హిట్ అయితే రాష్మిక సినీ పరిశ్రమలో లక్కీ గర్ల్ గా మారిపోతుంది.