విమానాశ్రయాల్లో భద్రత చర్యలు

SMTV Desk 2019-03-02 15:09:19  Airport, Visitors, Enquiry, Pulwama Attack, Pakistan, Terrorist

న్యూఢిల్లీ, మార్చి 2: పుల్వామా ఉగ్రదాడి తరువాత దేశంలోని విమానాశ్రయాల్లోకి విజిటర్స్‌ను అనుమతించలేదు. కాగా, నిన్నటి నుండి విజిటర్స్‌ను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. భారత్ వైమానిక దళం జరిపిన దాడుల నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా మళ్లీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోకి విజిటర్స్‌ను అనుమతించరు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉండడంతో ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్, ఇంకా మనపై దాడులు చేయవచ్చు అన్న అనుమానంతో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా పాకిస్థ పరోక్ష యుద్దలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి విమానాశ్రయాల్లో అలజడి సృష్టించే అవకాశం ఉందన్న అనుమానంతో మార్చి ఒకటి నుంచి ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వం నుండి ఆదేశాలు అందే వరకు ఈ నిబంధన కొనసాగుతుందని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలియజేశారు.