కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న '118' టీం

SMTV Desk 2019-03-02 14:06:08  Kalyan Ram, Guhan, Mahesh K. Koneru, Shekar Chandra, 118, Nivetha Thamus, Shalini Pande

హైదరాబాద్, మార్చి 2: కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో రూపొందిన 118 నిన్ననే విడుదలైంది. ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా థామస్, షాలినీ పాండే నటించారు. కాగా, ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ సినిమా టీమ్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది.

ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, "గుహన్ గారు ఈ కాన్సెప్ట్ ను నాకు చెప్పినప్పుడు నేను ఒప్పుకోకపోయుంటే ఇప్పుడు చాలా బాధపడేవాడినేమో. కథలో కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. నా తమ్ముడు ఎన్టీఆర్ ఈ సినిమా చూడగానే, తప్పకుండా దీనిని ప్రేక్షకులు ఆదరిస్తారని ఎంతో నమ్మకంతో చెప్పాడు .. నా తమ్ముడు చెప్పిందే నిజమైంది. మా మీద నమ్మకంతో ఈ సినిమాను కొన్న దిల్ రాజుగారికి .. ఆదరిస్తోన్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు" అని అన్నారు.

కాగా ఈ సినిమా మహేష్ కే. కోనేరు నిర్మించగా, శేఖర్ చంద్ర స్వరాలనందించారు.