రికార్డ్‌పై కన్నేసిన భారత్

SMTV Desk 2019-03-02 12:12:57  India, Australia,

ఇండియాలో పర్యటించే ఏ జట్టుకైనా భారత్ ను ఓడించడం అంత తేలిక కాదు. ఎందుకంటే సొంతగడ్డపై భారత జట్టు పటిష్ఠంగా ఉంటుంది. అద్భుతమైన బౌలింగ్ బ్యాటింగ్‌లతో ముప్పు తిప్పలు పెడుతుంది కానీ హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో పరిస్థితి మాత్రం వేరు. ఆస్ట్రేలియా గతంలో ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఒకసారి కూడా ఓడిపోలేదు. 2007లో టీమిండియాను ఆసీస్‌ 47 పరుగుల తేడాతో ఓడించింది. అయితే రెండేళ్ల తర్వాత 2009లో షాన్‌మార్ష్‌ అద్భుత శతకం సహాయంతో మూడు పరుగుల తేడాతో విజయం అందుకుంది.

కాగా ఈ రోజు ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అజేయ రికార్డును బద్దలు కొట్టాలని టీం ఇండియా పట్టుదలతో ఉంది. వరుసగా రెండు టీ20ల్లో ఓడించిన కంగారూలను మట్టికరిపించాలని భావిస్తోంది. ఆ జట్టుపై చివరి ఏడు వన్డేల్లో తలపడిన భారత్‌ ఆరింట్లో విజయం సాధించడం గమనార్హం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ చేరుకున్న కోహ్లీసేన ఉప్పల్‌ మైదానంలో తీవ్ర కసరత్తులు చేసింది. నెట్స్‌లో శ్రమించింది. మరి ఉప్పల్‌ మైదానంలో 12 ఏళ్ల రికార్డును కోహ్లీసేన బద్దలు చేస్తుందేమో చూడాలి.ఈ వన్దే కి మహేంద్ర సింగ్ ధోని ఆడటం అనుమాంగంగా మారింది .. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో అతనికి గాయం ఐంది ..