అభినందన్ పై ఆసక్తికర ట్వీట్ చేసిన అశ్విన్ ..

SMTV Desk 2019-03-02 11:56:15  Abhinandan, ashwin, India, pakistan

న్యూడిల్లీ, మార్చి 02: పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్-16ను తరుముకుంటూ వెళ్లిన అభినందన్ తన మిగ్ విమానం కూలిపోవడంతో, పాకిస్తాన్ భూభాగంలో పడ్డాడు. దీంతో ఆ దేశ సైనికులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్ దౌత్యపరంగా చేసిన ఒత్తిడితో దిగొచ్చిన పాక్ శుక్రవారం అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ చేర నుండి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నందుకు దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

భారత్ వీరుడికి స్వాగతం పలుకుతూ దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ట్వీట్లు చేశారు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. తన జీవితంలో ఇప్పటి వరకు అభినందన్ లాంటి హీరోను ఈ భూమిపై చూడలేదని పేర్కొన్నాడు. అభినందన్ కు స్వాగతం అని ట్వీట్ చేసాడు అశ్విన్.