అభినందన్ విడుదల ప్రక్రియలో పాక్ హై డ్రామా

SMTV Desk 2019-03-02 11:10:28  Abhinandn, Pakistan, India

వాఘా, మార్చి 02: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేసే ప్రక్రియలో పాకిస్తాన్ హై డ్రామా ప్లే చేసింది. నిజానికి అభినందన్ ను విడుదల చేసే విషయమై పాకిస్తాన్ ఎంతో గొప్పగా భావించింది. తమ సహృదయతను ప్రపంచానికి తెలిసేలా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించింది.

అందుకే అభినందన్ ను వాఘా బోర్డర్ వద్దకు తీసుకువచ్చి అక్కడ నిర్వహించే బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమంలో సగర్వంగా అప్పగించాలని తలపోసింది. కానీ భారత్ తన దాయాది ఉద్దేశాన్ని ముందే పసిగట్టిన నేపథ్యంలో వాఘా వద్ద నిర్వహించే బీటింగ్ ద రిట్రీట్ ను రద్దు చేసింది. దాంతో పాక్ ప్రణాళిక భగ్నమైంది.

బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమంలో అభినందన్ ను భరత్ కి అప్పగించి అంతర్జాతీయ సమాజం దృష్టిలో పడాలని ఆశించిన పాకిస్తాన్ కు భారత్ బీటింగ్ ద రిట్రీట్ ను రద్దు చేసి షాక్ ఇచ్చింది. ఆ అక్కసుతోనే సాయంత్రానికల్లా పంపాల్సిన అభినందన్ ను రాత్రి వరకు వేచి ఉండేలా చేసింది. డాక్యుమెంటేషన్ పేరుతో తీవ్ర కాలయాపన చేసింది. సాధారణంగా గంట సమయంలోపే పూర్తయ్యే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం ఒక పూటంతా వృథా చేసింది. పాకిస్తాన్ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామని వాఘా బోర్డర్ వద్ద విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది అన్నారు.

అంతేకాకుండా అభినందన్ ను విడుదల చేసే ముందు అతనితో ఒక వీడియో ప్లాన్ చేసింది పాక్. అందులో అభినందన్ తో తమ విశాల దృక్పథాన్ని, మానవీయతను ప్రసంశించేలా చేసింది. ఆ వీడియోను సామజిక మాధ్యమంలో ఉంచి తమ దేశ గొప్పతనాని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంది.