మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

SMTV Desk 2019-03-02 11:09:32  Karthik, Student, Suicide, Medical Academy, Coaching Center, Police

అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. జిల్లాలోని విజయవాడలో ఉన్న కానూర్ వికాస్ మెడికల్ అకాడమిలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న కార్తీక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనను గమనించిన తోటి విద్యార్థులు తమకు సమాచారం అందించారన్నారు. ఈ విషయమై కార్తీక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంగానే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ...... కార్తీక్ స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి అని పేర్కొన్నారు. యువకుడి మృతికి కారణమేంటో ఇంకా తమకు తెలియదనీ, దర్యాప్తులో అన్నీ బయటపడతాయని వ్యాఖ్యానించారు. కార్తీక్ తల్లిదండ్రులు స్వస్థలం నుంచి విజయవాడకు బయలుదేరారని పేర్కొన్నారు.