63 వ చిత్రంలో విజయ్ పాత్ర ఇదే!!

SMTV Desk 2019-03-02 11:07:09  Vijay, Atlee, vijay 63rd film, Nayanathara, AR Rehman

చెన్నై, మార్చి 02: తమిళ్ హీరో విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దీపావళి సందర్భంగా విడుదలైన మెర్సల్ , సర్కార్ సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు హీరో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దంగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తన 63 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం కూడా దీపావళికే విడుదలకానుందని చిత్ర నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో విజ ఒక కోచ్ పాత్రలో కనిపిస్తాడు. ేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తెరి, మెర్సల్ తరువాత విజయ్ -అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి.