అభినందన్ అప్పగింతల విషయంలో కీలక పాత్ర వీరిదే!!

SMTV Desk 2019-03-02 11:05:58  Red Cross Charity, Key Role, Abhinandan, Pakistan, Mediator

న్యూఢిల్లీ, మార్చి 2: వివిధ ఛారిటీ కార్యక్రమాలు చేపడుతూ రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయంగా పేరు పొందింది. కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం భారత పైలట్ అభినందన్ ను అప్పగింతల కార్యక్రమంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరించింది. జెనీవా ఒప్పందం ప్రకారం తమ కస్టడీ నుంచి విడుదల చేసిన అభినందన్ ను పాక్ తొలుత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు అప్పగించింది.

ఈ సంస్థ నేతృత్వంలోనే అభినందన్ ను వాఘా సరిహద్దు వద్దకు తీసుకువచ్చినట్టు సమాచారం. అక్కడ పాక్ అధికారులు నిర్వహించిన ఆఖరి దశ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అంతా ఈ సంస్థ ప్రతినిధుల సమక్షంలోనే జరిగింది. అభినందన్ కు వీసా జారీ చేసిన అనంతరం అతడిని రెడ్ క్రాస్ కమిటీ భారత వాయుసేన అధికారులకు అప్పగించింది. శుక్రవారం ఉదయం పాక్ కస్టడీ నుండి వెలుపలికి వచ్చేవరకు వాఘా సరిహద్దు వద్ద అభినందన్ భారత గడ్డపై కాలుమోపేవరకు రెడ్ క్రాస్ మధ్యవర్తిగా ముఖ్యపాత్ర పోషించింది.