అభినందన్ జిందాబాద్ అంటూ నినాదాలు

SMTV Desk 2019-03-02 10:55:10  India, Abhinandan, Amruthsar, Vagha Border, Pakistan, Shiv Dular Singh Thillan

వాఘా,మార్చి 02: భారత వింగ్ కమాండర్ అభినందన్ నిన్న రాత్రి మాతృభూమిపై కాలుమోపారు. పంజాబ్ లోని వాఘా బోర్డర్ వద్ద పాకిస్తాన్ అధికారులు అభినందన్ ను భారత వర్గాలకు అప్పగించారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత అభినందన్ వాఘా చెక్ పోస్ట్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. తన దృఢచిత్తంతో దేశభక్తికి ప్రతిరూపంలా నిలిచిన అభినందన్ ను చూడగానే వాఘా వద్ద అభినందన్ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి. వాఘా బోర్డర్ కు వచ్చిన అభినందన్ బ్లేజర్, గ్రే పాంట్స్ ధరించి ఎంతో హుందాగా కనిపించాడు. వాయుసేన అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. భారత్ కు తిరిగి రావడంపై అభినందన స్పందిస్తూ ... సొంత గడ్డపై మళ్ళీ అడుగుపెట్టడం ఆనందంగా ఉందని అమృత్ సర్ నగర డిప్యూటీ కమిషనర్ శివ్ దులార్ సింగ్ థిల్లాన్ తో ఆయన పలికినట్టు తెలుస్తుంది.