118 మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

SMTV Desk 2019-03-01 13:51:27  118,

నంద‌మూరి కాంపౌండ్ నుండి అప్‌లోడ్ అయిన క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం 118. కె.వి.గుహన్‌ దర్శకత్వంలో
తెరకెక్కిన ఈచిత్రంలో నివేథా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు నిర్మించారు.

పటాస్ సినిమా తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కళ్యాణ్ రామ్‌కు సరైన హిట్టే లేదు. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గ‌తేడాది కూడా తమన్నాతో కలిసి నటించిన నా నువ్వేతో పాటు కాజల్‌తో చేసిన ఎమ్మెల్యే సినిమా కూడా ప్రేక్ష‌కులను మెప్పించ‌లేక‌పోయాయి.

దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు క‌ళ్యాణ్ రామ్. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు కె.వి.గుహన్ డైరెక్ష‌న్‌లో ఓ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో మ‌న ముందుకు వ‌చ్చాడు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్,ట్రైల‌ర్‌లు ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఈ శుక్ర‌వార‌మేప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ అవ‌డంతో సినిమా చూసిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతున్నారు.

118 ట్విట్ట‌ర టాక్ ఏంటంటే.. ఇది పక్కా థిల్ల‌ర్ మూవీ అని చెబుతున్నారు. క‌ళ్యాణ్‌రామ్, నివేదా థామ‌స్ న‌ట‌న సినిమాకే హైలెట్ అయ్యింద‌ని, గుహ‌న్ స్క్రీన్‌ప్లే అదిరిపోయింద‌ని, శేఖ‌ర్ చంద్ర బ్యాగ్రైండ్ మ్యూజిక్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింద‌ని, ఫ‌స్ట్‌హాఫ్, ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండ్‌హాఫ్ అద్భుతంగా ఉంద‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.