118 ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ?

SMTV Desk 2019-03-01 13:40:38  118,

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కే వి గుహన్ దర్శకత్వంలో షాలిని పాండే హీరోయిన్ గా నివేతా థామస్ ఒక కీలక పాత్రలో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా మంచి అంచనాలతో 118 సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదలు కావడమే 118 టైటిల్లో ఉన్న సస్పెన్స్ మిస్టరీ ఏంటో తెలుపుతూ ఆసక్తికరంగా మొదలవుతుంది.అలాగే కళ్యాణ్ రామ్ మరోసారి జర్నలిస్ట్ గా మంచి నటన కనబర్చారు.తన కలలో కనిపించిన నివేతా థామస్ ఎవరో కనుక్కోడానికి చేసే ఇన్వెస్టిగేషన్ సీన్లు సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతాయి.కళ్యాణ్ రామ్ మరియు షాలిని పాండే ల మధ్య వచ్చిన చందమామే పాత కూడా బాగానే ఉంది.మొత్తానికి ఈ సినిమా ఫస్టాఫ్ చక్కని కథనంతో సినిమా డీసెంట్ గా ఉంది.సినిమాలో కాన్సెప్ట్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ లో ట్విస్ట్ సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతాయి.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి..