నేను ఎక్క‌డుంటానో తెలుసు కదా: కోహ్లీ

SMTV Desk 2017-08-04 18:40:32  Virat Kohli wishes to Bolt, jamica cheetah, Bolt, Usain bolt

కొలంబో, ఆగష్టు 4: జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రేపు తన చివరి రేస్‌లో పరిగెత్తనున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లీ, బోల్ట్‌కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. బోల్ట్‌కు విరాట్ ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు. చివరి రేస్ అయితే ఏమైంది. ట్రాక్‌ మీద అయినా, బ‌య‌ట అయినా నువ్వు ఎప్పటికీ చిరుతవే. ఎప్పుడైనా క్రికెట్ ఆడాలనిపిస్తే వచ్చేయ్‌, నేను ఎక్క‌డుంటానో తెలుసు కదా అంటూ కోహ్లీ బోల్ట్‌ని ఆహ్వానించాడు. కాగా, జమైకా చిరుతకు క్రికెట్ అంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. వీరిద్దరికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బోల్ట్‌ను పరుగుల యంత్రంగా పిలిస్తే, కోహ్లీని బ్యాటింగ్ యంత్రంగా పిలవడం గమనార్హం.