అభినందన్ కోసం డిల్లీ బయలుదేరిన తల్లిదండ్రులు

SMTV Desk 2019-03-01 13:16:46  Abhinandan, Pakistan, Imran Khan, New Delhi

న్యూడిల్లీ, మార్చి 01: భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన పాకిస్తాన్ విమానాలను తిరిగి వెనక్కి తరుముతుండగా ప్రమాదవశాత్తు పాకిస్తాన్ సైన్యం చేతికి చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ ప్రభుత్వం నేడు విడుదల చేయబోతోంది. దౌత్యమార్గాల ద్వారా భారత్ తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్‌ను నేడు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్నీ స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ ప్రకటనతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో చిక్కుకున్న తమ కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న అభినందన్ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూసేందుకు డిల్లీ బయలుదేరారు. గురువారం రాత్రి వారు డిల్లీ బయలుదేరారు. పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు.