శ్రీలంకను మొదట్లోనే నిలువరిస్తున్నభారత జట్టు ఆటగాళ్ళు

SMTV Desk 2017-08-04 18:14:27  colombo test, Srilank vs India second test first innings, India first innings Declare, India Srilanka Cricket latest Test match

కొలంబో, ఆగష్టు 4: కొలంబోలో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల పతనంతో 622 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది. టీమిండియా ప్లేయర్లలో ధావన్ 35 పరుగులు, కేఎల్ రాహుల్ 57, పుజారా 133, కోహ్లీ 13, రహానే 132, అశ్విన్ 54, సాహా 67, పాండ్యా 20, షమీ 19 పరుగులు చేశారు. జడేజా 70, ఉమేష్ యాదవ్ 8 నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ 4, పుష్పకుమార 2, కరుణరత్నే, పెరీరాలు చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను మొదట్లోనే నిలువరిస్తున్నారు భారత జట్టు ఆటగాళ్ళు. ఓపెనర్ తరంగాను డకౌట్ చేశారు. అశ్విన్ బౌలింగ్‌లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చిన తరంగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కరుణరత్నే (7), మెండిస్ (2) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుతం 9పరుగులు చేసి ఒక వికెట్‌ని నష్టపోయింది. ఇలానే కొనసాగితే శ్రీలంకకు భారత్ స్కోర్ భారీ లక్ష్యంగా మారనుంది.