గంటకు 160 కిలోమీటర్ల వేగం తో దూసుకపోతున్న హైస్పీడ్ రైలు

SMTV Desk 2019-02-28 18:00:08  High speec rail,

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 : భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశంలో ఇక హైస్పీడ్ రైళ్లను నడపాలని రైల్వేశాఖ ఇటీవలే నిర్ణయించింది. దీనిలోభాగంగా చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ కొత్తగా వేగంగా వెళ్లే వ్యాప్ -7 లోకోమోటివ్ లను తయారీకి శ్రీకారం చుట్టింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేలా కొత్త ఇంజన్లను చిత్తరంజన్ లోకోమోటివ్ తయారు చేస్తోంది. ఈ స్పీడు రైలు ఇంజన్ ను ఘజియాబాద్ షెడ్ లో ట్రయల్ పరీక్షలు చేస్తోంది.

ఈ నూతన రైలు ఇంజన్లను సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్స్ రాజధాని, శతాబ్ది, దురంతో తదితర రైళ్లకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త మోడల్ రైలు ఇంజన్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ రూపొందించింది. రైలు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఇంజన్ బరువును 14 టన్నులు తగ్గించడంతోపాటు గేర్ రేషియోను తగ్గించనున్నారు. దేశంలో మొట్టమొదటి రైలు ఇంజన్ ను 1950లో చిత్తరంజన్ పట్టణంలోనే తయారు చేశారు. నాటి నుంచి రైలు ఇంజన్ల తయారీలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వేగంగా నడిచే రైలు ఇంజన్లను రూపొందించింది.