హీరో రామ్ ఇచ్చే సర్‌ప్రైజ్ తెలుసుకుందామా!!!

SMTV Desk 2017-08-04 17:44:55  HERO RAM SURPRISES AUDIANCE ON FRENDSHIP DAY

హైదరాబాద్, ఆగస్ట్ 4 : "నేను శైలజ" తో మంచి హిట్ అందుకున్నారు హీరో రామ్. ఆ తర్వాత వచ్చిన హైపర్ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం రామ్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో "ఉన్నది ఒక్కటే జిందగీ" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కి జోడీగా లావణ్య త్రిపాఠి నటించనుంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ ఆదివారం ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకొని ఓ ట్వీట్ చేశాడు. "అభిమానులకు సర్‌ప్రైజ్! ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో స్నేహం గురించి తెలియజేసే ఒక సాంగ్ ను ఈ ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నాం." అంటూ ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కాగా రామ్ చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ.. అవును ఈ పాటను రచయిత చంద్రబోస్ ఎంతో అద్భుతంగా రాశారు. ప్రేమను పంచే ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం అంటూ స్పందించారు.