'మన్మథుడు 2'లో ముఖ్యమైన పాత్రలో సమంత

SMTV Desk 2019-02-28 17:07:19  manmadhudu2, smantha, manmadhudu sequel

హైదరాబాద్, ఫిబ్రవరి 28: నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో మన్మథుడు ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా నాగార్జున క్రేజ్ ను మరింతగా పెంచేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా మన్మథుడు 2 రూపొందుతోంది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మార్చి 12వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్టు షూటింగ్ యూరప్ లో జరగనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ఎంపిక జరిగిపోయింది. ఆ తరువాత ఒక కీలకమైన పాత్రను అనుష్క చేయనుందనే వార్త వినిపించింది. తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. అనుష్క బదులుగా సమంతను తీసుకోనున్నారా? లేదంటే సమంత పోషించేది వేరే పాత్రనా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.