'టెంపర్' తమిళ రీమేక్ లో అల్లు అర్జున్ సాంగ్

SMTV Desk 2019-02-28 16:12:19  temper, tamil remake, vishal, rashi khanna

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల హిందీలోకి రీమేక్ చేయబడిన ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయోగ్య టైటిల్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, విశాల్ సరసన నాయికగా రాశీ ఖన్నా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటమ్ సాంగ్ పెడితే బాగుంటుందని దర్శకుడు వెంకట్ మోహన్ భావించాడట. గతంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ .. బ్లాకు బస్టరే .. ఐటమ్ సాంగ్ ను ఈ సినిమాలో పెట్టాలనే దిశగా ఆలోచన చేస్తున్నాడట. ఈ సాంగ్ విశాల్ కి కూడా చాలా ఇష్టమట. అందువలన ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో, రీమిక్స్ చేయడానికి సన్నాహాలు మొదలెట్టినట్టు సమాచారం.