కొలంబో టెస్ట్లో‌ అశ్విన్ మరో ఘనత

SMTV Desk 2017-08-04 16:31:48  Ravichandran ashwin Test Double, Colombo test ashwin Record, India-srilanka Test match Ashwin Record

కొలంబో, ఆగస్ట్ 4: కొలంబోలో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్ట్ టీమిండియా ప్లేయర్ల ఘనతలకు వేదిక అయ్యింది. గురువారం తన 50వ టెస్టులో సెంచరీ పూర్తి చేసిన ఏడవ భారత బ్యాట్స్‌మెన్ గా పుజారా రికార్డు సాధించాడు. కాగా, నేడు భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. వేగంగా టెస్ట్ డబుల్ సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టెస్టులో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టెస్టుల్లో 11వ అర్ధ శతకాన్ని చేయడమే కాకుండా 2వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 2004 పరుగులు సాధించిన అశ్విన్ ఖాతాలో ఇప్పటికే 279 వికెట్లు ఉన్నాయి. దీంతో అశ్విన్ టెస్ట్ డబుల్ సాధించాడు. టెస్టుల్లో 2వేల పరుగులు, 250 వికెట్లు తీసిన నాలుగో భారత క్రికెటర్‌గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు ఉండగా అశ్విన్ నాలుగో స్థానంలో నిలిచాడు. కేవలం 51 మ్యాచ్‌లలోనే కుంబ్లే టెస్ట్ డబుల్ పూర్తిచేశాడు.