అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి: ఓవైసీ

SMTV Desk 2019-02-28 13:31:03  Asaduddin Owaisi, Pilot, AIMIM, MP, Pakistan, Mig Flight

హైదరాబాద్, ఫిబ్రవరి 28: బుధవారం ఉదయం భారత్ వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానం కుప్పకూలిపోయి, భారత పైలట్ అభినందన్ పాక్ చెరలో చిక్కుకున్నా సంగతి తెలిసిందే. కాగా ఈ విషాదం పట్ల ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు. పైలట్ అభినందన్ క్షేమంగా భారత్ కు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ విమానం పైలట్ జాడ కనిపించకుండా పోవడం, ఆ తర్వాత కొద్ది సేపటికే పాకిస్థాన్ బలగాలు ఆ పైలట్ ని అదుపులోకి తీసుకున్నాయని ప్రకటించడం విషాదకరమన్నారు.

ఇలాంటి కష్టమైన సమయంలో అభినందన్, అతని కుటుంబ క్షేమం కొరకు తాము ప్రార్ధనలు చేస్తున్నట్లు తెలిపారు. జెనియా కన్వెన్షన్స్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రతీ పార్టీ బందీల పట్ల మానత్వంతో వ్యవహరించాలని కోరారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పాకిస్తాన్ పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో మానవత్వంలో మెలగాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాద శిబిరాలపై భారత్ తీసుకున్న చర్యల అనంతరం పాకిస్తాన్ సైన్యం భారత మిలటరీని లక్ష్యంగా చేసుకుంది.