టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సమావేశాలు వాయిదా, అభినందన్ క్షేమంగా తిరిగిరావాలి: కేటీఆర్

SMTV Desk 2019-02-28 10:58:34  KTR, Chandrasekhar Rao, Parliament Meeting, Postpone, Abhinandan

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ప్రస్తుతం ఇండియా-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేది నుండి 12వ తేది వరకు జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేసుకుంటున్నట్లు ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్న సంగతి కేసీఆర్ తో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.