బెంగుళూరు టీ20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసిస్

SMTV Desk 2019-02-27 19:08:08  India vs Australia, T20, 2nd T20, 1st T20, Viat kohli, Aaron Finch

బెంగళూరు, ఫిబ్రవరి 27: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మరి కాసేపట్లో రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టాస్ గెలిచి ఆసిస్ బౌలింగ్ ను ఎంచుకొని మైదానంలోకి వెళ్ళడానికి సిద్దమయింది. ఇక ఆదివారం జరిగిన మొదటి టీ20 లో టీం ఇండియా చివరి బంతి వరకు పోరాడి ఘోరంగా పరజయపాలైన సంగతి తెలిసిందే. అయితే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కోహ్లీసేన తహతహలాడుతోంది.

టీం ఇండియా జట్టు : Shikhar Dhawan, Lokesh Rahul, Virat Kohli(c), Rishabh Pant, MS Dhoni(w), Dinesh Karthik, Vijay Shankar, Krunal Pandya, Yuzvendra Chahal, Jasprit Bumrah, Siddarth Kaul

ఆస్ట్రేలియా జట్టు : D Arcy Short, Marcus Stoinis, Aaron Finch(c), Glenn Maxwell, Peter Handscomb(w), Ashton Turner, Nathan Coulter-Nile, Pat Cummins, Jhye Richardson, Jason Behrendorff, Adam Zampa