కౌశల్ ఆర్మీకి క్లారిటీ ఇవ్వడానికి కౌశల్ రెడీ....

SMTV Desk 2019-02-27 18:51:55  Bigboss season2 winner koushal manda, TDP, AP Assembly elections, Koushal army

హైదరాబాద్, ఫిబ్రవరి 27: బిగ్ బాస్ సీజన్ 2 కౌషల్ మండా టైటిల్ గెలిచినప్పటినుండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక తాజాగా కౌశల్ ఆర్మీ కూడా రివర్స్ అవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాక ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున బరిలో దిగేందుకు కౌశల్ సిద్దమవుతున్నట్లు టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే కౌశల్ ఆర్మీ ఫండ్స్ పై కూడా అనేక ఆరోపణలు వస్తున్న సమయంలో అన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వాలని బిగ్ బాస్ విన్నర్ రెడీ అవుతున్నాడు. ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వడానికి రేపు కౌశల్ ప్ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా వస్తోన్న అన్ని అనుమానాలకు కామెంట్స్ కు కౌశల్ ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది.