రెహమాన్ ను వద్దని అనిరుధ్ కి ఛాన్స్ ఇచ్చిన తలైవా...

SMTV Desk 2019-02-27 18:50:16  Super star rajinikanth, AR Muragadas, AR Rehman, Peta

చెన్నై, ఫిబ్రవరి 27: సూపర్ స్టార్ రజినీకాంత్, ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించడానికి సిద్దమవుతున్నాడు. ఈ మధ్య వచ్చిన పేట సినిమాకు ఓ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్న అనిరుధ్ మరోసారి తన ఫెవరెట్ స్టార్ హీరో రజినీకాంత్ కోసం మ్యూజిక్ బాదడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాకు మొదట ఏఆర్.రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకుడిని అనుకున్నప్పటికీ రజినీకాంత్ సలహామేరకు అనిరుద్ కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. పేట సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సాంగ్స్ కూడా హిట్టయ్యాయి. దీంతో ఫిదా అయిన రజినీకాంత్ నెక్స్ట్ సినిమాకు కూడా అతనే కావాలని పట్టుబట్టడంతో మురగదాస్ కూడా తన నిర్ణయాన్ని చేంజ్ చేసుకొని అనిరుద్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే రజినీ చివరి సినిమా ఇదేనని టాక్ వస్తోంది. అందుకే ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా అనిరుద్ రజినీకాంత్ ఆఖరి సినిమా అని ఒప్పుకున్నట్లు సమాచారం.