సర్జికల్ స్ట్రైక్ సమయంలో పుట్టాడని ఆ పేరు పెట్టారట!!

SMTV Desk 2019-02-27 17:04:44  pok attack, iaf attack, surgical strike

రాజస్థాన్, ఫిబ్రవరి 27: తమ తాతో, తండ్రిపైనో, ఓ సెలెబ్రిటీపైనో, రాజకీయ నేతపైనో ఉన్న అభిమానంతో తమ బిడ్డకు ఆ పేర్లను పెట్టుకోవడం చూస్తుంటాం. కాని ఇక్కడ జరిగిన సంఘటన అందుకు పూర్తిగా భిన్నం. ఇది రాజస్థాన్ లో జరిగింది.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని బాలాకోట్ పై భారత్ వైమానిక దళం నిన్న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మెరుపు దాడులు జరిపి, ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసిన విషయం విధితమే. ఈ దాడిలో మిరాజ్-2000 జెట్ ఫైటర్లు కీలకపాత్ర పోషించాయి. అయితే, ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహావీర్, సోనమ్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు.

భారత్ సాధించిన విజయానికి గుర్తుగా తమ బిడ్డకు ఈ జెట్ ఫైటర్ పేరు కలిసి వచ్చేలా నామకరణం చేయాలని వీరు భావించారు. దీంతో, పండంటి తమ బిడ్డకు మిరాజ్ సింగ్ రాథోడ్ గా పేరు పెట్టినట్టు మీడియాకు తెలిపారు.