నడి రోడ్డుపై యువతికి పెట్రోలుతో నిప్పంటించిన ఓ ప్రేమోన్నాది...

SMTV Desk 2019-02-27 16:56:09  Boy attempt to murder on girl, Hanmakonda, Ravali, Kerosene

వరంగల్‌, ఫిబ్రవరి 27: వరంగల్ లో ఓ యువతిపై మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. స్థానికుల కథనం ప్రకారం...హన్మకొండకు చెందిన రవళి అనే డిగ్రీ విద్యార్ధిని కాలేజీకి నడిచి వెళ్తోంది. ఈ క్రమంలో అవినాష్ అనే యువకుడు ఆమెను అడ్డగించి నడిరోడ్డులోనే రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు ఆమెను కాపాడేందుకు ముందుకు రాగా వారిని అవినాశ్ బెదిరించాడు. స్థానికులు, తోటి విద్యార్థినులు మంటలను ఆర్పి.. రవళిని ఆసుపత్రికి తరలించారు. ప్రేమను వ్యతిరేకించడం వల్లే రవళిపై అవినాశ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.