శ్రీధరణి హత్య కేసు : ఏకాంతం కోసం వచ్చే ప్రేమికులే నిందితుడు టార్గెట్

SMTV Desk 2019-02-27 16:50:28  Sridharani murder case, Accused raju, Raju attacking lovers, Elooru

ఏలూరు, ఫిబ్రవరి 27: శ్రీధరణి హత్య కేసులో ఏలూరుకు చెందిన రాజు భాగోతం తాజాగా వెలిగులోకి వచ్చింది. ఇతడు ఏకాంతం కోసం వచ్చే ప్రేమజంటలపై తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ నెల 24న తేదీన నవీన్, శ్రీధరణిలు బౌద్ధారామాలయానికి వెళ్ళారు. అయితే అదే సమయంలో పక్షుల వేట కోసం నిందితుడు రాజు అక్కడికి వెళ్ళాడు. నవీన్‌ వద్దకు వచ్చి రాజు డబ్బులను డిమాండ్ చేశాడు. అయితే దానికి నవీన్ నిరాకరకరించడంతో రాజు తన వెంట తెచ్చుకొన్న కర్రతో దాడికి దిగాడు. దీంతో నవీన్ స్పృహా కోల్పోయాడు. అంతేకాక అక్కడే ఉన్న శ్రీధరణిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు ఆమె ప్రతిఘటించడంతో రాయితో ఆమె తలపై బాది హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ద్వారకా తిరుమల మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని రాజు వివాహం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఇదే ప్రాంతంలోని ఓ జీడి మామిడి తోటకు కాపలాగా ఉంటున్నాడు. అక్కడే భార్యతో కలిసి ఆయన కాపురం ఉంటున్నాడు.

కృష్ణా జిల్లాకు చెందిన రాజు నూజివీడులోని ఓ మామిడితోటకు కాపలాగా గతంలో ఉండేవాడు. ఆ సమయంలో కూడ ఈ ప్రాంతంలో ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటల నుండి భారీగా డబ్బులను గుంజేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే తరహాలోనే ఇక్కడ కూడ డబ్బులను వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా తిరుగుతూ పక్షులు, జంతువులను వేటాడుతున్నట్టుగా రాజు కుటుంబస్యులకు చెప్పారు. అయితే పర్యాటక ప్రదేశాలకు వచ్చే ప్రేమ జంటలను, పర్యాటకులను బెదిరించి డబ్బులు వసూలు చేయడాన్ని రాజు వృత్తిగా ఎంచుకొన్నాడు. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే వారిపై దాడి చేస్తున్నారు. ఏకాంతం కోసం వచ్చే ప్రేమికులు రాజు విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. ఈ విషయాన్ని బయటకు చెబితే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. ఈ కారణంగానే ఇంతకాలం పాటు రాజు చేసిన దారుణాలు వెలుగు చూడలేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.