ఏపీలో దొంగ ఓట్ల కలకలం...ఒకే ఇంటి నెంబర్ తో 71ఓట్లు

SMTV Desk 2019-02-27 16:48:31  Andhrapradesh state voters, Assembly elections, YSRCP, TDP

అమరావతి, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లు కలకలం రేపుతోంది. నెల్లూరులోని ఓ గ్రామంలో ఒకే ఇంటి నెంబర్ తో 71 ఓట్లు ఉండడంతో ఇప్పుడు ఇది వివాదాలకు దారి తీస్తుంది. అంతేకాక ఈ విషయాన్ని ఏపీ పరతిపక్ష పార్టీ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు. పూర్తి వివరాల ప్రకారం... నెల్లూరులోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ స్టేషన్ 164లో ఒకే ఇంటి నెంబర్ తో 71 ఓట్లు ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసి.. 63ఓట్లను జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ఇంటి నెంబర్ 4-2-75 , కృష్ణ మందిరం, నెల్లూరు అడ్రస్ తో 71 ఓట్లు ఉండటాన్ని వైసీపీ నేతలు ముందుగా గుర్తించారు. దానిని ఫోటోస్టాట్ కాపీలు తీసి.. మీడియాకు అందజేశారు. ఈ న్యూస్ బాగా వైరల్ అవ్వడంతో ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు జాబితాను సరిచేసి.. ఫేక్ ఓట్లను తొలగించేశారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ నకిలీ ఓట్లను టీడీపీ నేతలే సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.