మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కు మోదీ జ్ఞాపక లేఖ

SMTV Desk 2017-08-03 19:56:50  Indian Prime Minister Narendra Modis letter, Former President Pranab Mukherjee

న్యూఢిల్లీ, ఆగస్టు 3 : తండ్రిలా, గురువుల మార్గ నిర్దేశం చేశారంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖ తన హృదయాన్ని తాకిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. మోదీ రాసిన ఉద్వేగభరితమైన లేఖను ట్విట్టర్ లో పెట్టిన ప్రణబ్ రాష్ట్రపతి గా చివరి రోజు తన జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు. మోదీ రాసిన ఈ లేఖ తమ హృదయాన్ని తాకిందన్నారు. ఆ లేఖలో దాదా మీరు ఎప్పటికీ నాకు తండ్రి సమానులు, మార్గదర్శకాలే అని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం తను ఒంటరిగా ఢిల్లీకి వచ్చినప్పుడు తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, మీరు చూపిన మార్గం, మీ విలువైన సలహాలు తనకెంతో ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రణబ్ మేధస్సు విజ్ఞానం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని లేఖలో తెలిపారు. ఇద్దరివి భిన్న రాజకీయ మార్గాలని గుర్తు చేసిన మోదీ దాదా అపార అనుభవం జాతీయ దృక్పథం ప్రధానిగా విధినిర్వహణలో తనకెంతో దోహదం చేశాయని లేఖలో తెలిపారు. ఆరోగ్య రక్షణపై ఫోన్ లో ఆరా తీయడం తనకు కొత్త శక్తిని ఇచ్చేవని ప్రణబ్ ముఖర్జీ చూపిన ప్రేమానురాగాల ద్వారా గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నేత మీరంటు ఆయనపై ప్రశంసంల కురిపించిన మోదీ మీతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాని ప్రకటించారు. గత నెల 24న మోదీ రాసిన ఈ లేఖ ప్రణబ్ ముఖర్జీ, మోదీకి మధ్య అనుబంధానికి అర్ధం పుడుతుంది.