ప్రపంచంలోనే అతి పెద్ద భగవద్గీత!

SMTV Desk 2019-02-27 16:47:23  Narendra Modi, Bhagavath Geetha, Iscon Company

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఈ గ్రంథానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అందుకే, ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీమద్ ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, గీతా ప్రచారాన్ని ప్రారంభించి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ఆవిష్కరించారు. ఈ పవిత్ర పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆవిష్కరించారు. 800 కేజీల బరువు ఉన్న ఈ పుస్తకంలో 670 పేజీలు ఉన్నాయి. 2.8 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉండే ఈ భగవద్గీత ప్రపంచంలోనే అతి పొడవైన ఆధ్యాత్మిక గ్రంథం కూడా అని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు. దీన్ని ఆవిష్కరించడానికి మోదీ మెట్రో రైల్లో వచ్చారు. కాగా, ఇస్కాన్ సంస్థ కృష్ణ తత్వాన్ని ప్రంపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.