తెలుగు సన్నీ లియోన్‌... స్వాతి నాయుడు వివాహం

SMTV Desk 2019-02-27 16:35:41  Swathi Nayudu, Youtube

హైదరాబాద్, ఫిబ్రవరి 27: యుట్యూబ్ లో తెలుగు సన్నీ లియోన్‌గా పేరు తెచ్చుకున్న స్వాతి నాయుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈమె వివాహం అవినాష్ అనే వ్యక్తితో విజయవాడలో వైభవంగా జరిగింది. ఈ విషయం చాలామంది నమ్మకపోవడంతో ఆమె స్వయంగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెళ్లి తర్వాత తన భర్త, తండ్రిని ఆమె తన అభిమానులకు పరిచయం చేసింది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న తనకు అందరి ఆశీస్సులు కావాలని కోరింది.

గతంలో పోర్న్ మూవీస్‌లో నటించడానికి సిద్ధమంటూ ప్రకటించిన స్వాతి యూట్యూబ్ వినియోగదారులకు ఎంతో సుపరిచితమైన వ్యక్తి. సినీ రంగంలో నటిగా ఎదగాలనే కోరికతో వచ్చిన స్వాతికి వెండితెరలో, బుల్లితెరలో ఎక్కడా అవకాశాలు రాలేదు. బ్లూఫిల్మ్స్ చేయాలని ఉన్నా, ఇండియాలో పుట్టడం వలన సాధ్యం కావడం లేదని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం టీవీ ఛానళ్లలో ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలకు ఆమె హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.