అమెజాన్ లోకి మాజి సీఈవో

SMTV Desk 2019-02-27 13:36:52  Amazon, Indranui

పెప్సీకో కంపెనీ మాజీ సీఈవో ఇంద్రానూయి ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ లో చేరారు. ఈ విషయం అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆమెజాన్ సంస్థలోని 11 మంది బోర్డు సభ్యులలో ఆమెను ఒకరిగా తీసుకొన్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఆమె ఆడిట్ కమిటీలో పనిచేయబోతున్నారని ఆ సంస్థ తెలిపింది.

ఇంద్రానూయి గత ఏడాది అక్టోబరులో పెప్సీకో నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆమె తప్పుకొన్న తరువాత ఆమె స్థానంలో రామన్ లాగుర్తా పెప్సీకో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.