మళ్ళీ తెరపై సందడి చేయబోతున్న హాస్యబ్రహ్మ

SMTV Desk 2019-02-27 13:35:29  Brahmanandam, Heart surgery, movies

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం తెలుగు తెరపై దశాబ్దాలుగా హాస్యం పండిస్తూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన పోషించిన పాత్రలలో కొన్ని ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన గుండెకు సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా ఆయన సినిమాలు చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆయన అనారోగ్యం పాలవ్వడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇటీవల ఆయన కోలుకుంటున్నారని తెలిసి అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇకపై ఆయన మళ్ళీ సినిమాలో నటిస్తారా లేదా అని అందరు అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు అభిమానులకు హాస్యం పంచడానికి బ్రహ్మానందం మళ్ళీ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారట. ముందుగానే కొన్ని సినిమాలను కమిట్ అయిన ఆయన, వాటి షూటింగ్ నిమిత్తం వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది.